
రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తన ఇద్దరు చెల్లెళ్లు విజయదుర్గ, మాధవి రాఖీలు కట్టిన ఫొటోలను చిరు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో చిరు సోదరలు నాగాబాబు, పవన్ కల్యాణ్ లేకపోవడం గమనార్హం.
Happy #RakshaBandhan to all!
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 31, 2023
అందరికీ రాఖీ శుభాకాంక్షలు !! pic.twitter.com/n9iaoIwpBK
ఇటీవల భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశపరిచారు. ప్రస్తుతం బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠతో ఓ సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్నఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ అనౌన్స్ చేశారు.